కార్తిక మాసం మూడో సోమవారం కావటంతో పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఇక్కడ స్వామివారు పౌర్ణమి రోజు తెలుపు రంగులోనూ.. అమావాస్యకు నలుపు రంగులో దర్శనమిస్తారు. కాగా దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
కార్తిక పౌర్ణమి.. శ్వేత వర్ణంలో సోమేశ్వర జనార్ధనుడు - one of the pancharama kshetram at bhimavaram news update
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా స్వామివారు తెలుపు రంగులో దర్శనమించారు.
పౌర్ణమిని పురష్కరించుకొని తెలుపురంగులో సోమేశ్వర జనార్ధనుడు