Solvent leak on Road: పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari district) ద్వారక తిరుమల మండలం గుణ్ణంపల్లి శివారు లక్ష్మీ నగరం వద్ద జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఓ ఆయిల్ టాంకర్ లో టెట్రా హైడ్రా ఫ్యూరాన్ అనే మండే స్వభావం కలిగిన సాల్వెంట్ రోడ్డుపై లీక్ అవడంతో లారీ ని పక్కకు ఆపివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లీకైన సాల్వెంట్ పై నీళ్లు, ఫోమ్ని చల్లి మంటలు వ్యాపించకుండా నిర్వీర్యం చేశారు.
Solvent leak on Road: రోడ్డుపై లీకైన సాల్వెంట్.. 7 గంటలు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది - పశ్చిమ గోదావరి జిల్లా తాజా సమాచారం
పశ్చిమ గోదావరి జిల్లాలో జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. ఓ ఆయిల్ టాంకర్లో టెట్రా హైడ్రా ఫ్యూరాన్ అనే మండే స్వభావం కలిగిన సాల్వెంట్ రోడ్డుపై లీక్ అవడంతో లారీని పక్కకు ఆపివేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. లీకైన సాల్వెంట్పై నీళ్లు, ఫోమ్ని చల్లి మంటలు వ్యాపించకుండా నిర్వీర్యం చేశారు.
వైజాగ్‌లోని ఓ ఫార్మా కంపెనీ నుంచి ఆయిల్ ట్యాంకర్లో టెట్రా హైడ్రా ఫ్యూరాన్ అనే సాల్వెంట్‌ను హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ క్రమంలో ట్యాంకర్ లారీ గుణ్ణంపల్లి సమీపానికి వచ్చేసరికి టాంకర్ వాల్ లీకై సాల్వెంట్ రోడ్డుపై పడటం ప్రారంభమైంది. అప్రమత్తమైన లారీ డ్రైవర్ ట్యాంకర్‌ను పక్కకు నిలిపివేశాడు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా... భీమడోలు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుంది. సుమారు 7 గంటలు శ్రమించి ట్యాంకర్ నుంచి లీక్ అవుతున్న సాల్వెంట్‌ను నిర్వీర్యం చేశారు. దాంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరు భయపడాల్సిన పనిలేదని ఇండస్ట్రీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ త్రినాథరావు తెలిపారు.
ఇదీ చదవండి