ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి స్థలాలు ఇవ్వాలని దళితుల ధర్నా

ఏజెన్సీలో నివసిస్తున్న తమకు ఇంటి స్థలాలు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళితులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం తమను ఆదుకోవటంలో విఫలం అయ్యిందని వాపోయారు.

By

Published : Jul 9, 2019, 7:02 AM IST

ధర్నా చేస్తున్న దళితులు

ధర్నా చేస్తున్న దళితులు

ఏజెన్సీలో నివసిస్తున్న తమకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ దళితులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పోలవరం నియోజవర్గం రెవెన్యూ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సీనియర్ అసిస్టెంట్ కృష్ణకు వినతి పత్రం అందజేశారు .దళిత నాయకుడు బొంతు రవి తేజ మాట్లాడుతూ ....ఏజెన్సీలో నివసిస్తున్న తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వ ఫలాలు అందించటంలో పాలకులు విఫలమవుతున్నారని ఆరోపించారు. ఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్లు నిలుపుదల చేసి తమ అభివృద్ధిని అడ్డుకున్నారని.. ఇల్లు లేక దళితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మన్యంలోని గిరిజనేతరులను గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు అర్హులుగా గుర్తించాలన్నారు .గిరిజనులతోపాటు దళితులకు కూడా సమాన హక్కులు కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details