ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 19, 2020, 12:46 PM IST

ETV Bharat / state

షష్ఠి ఉత్సవాలకు ఉండ్రాజవరంలో ఏర్పాట్లు పూర్తి

పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరంలో ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉత్సవాలకు సిద్ధమైంది. కొవిడ్ కారణంగా ఈ సంవత్సరం ఊరేగింపులకు అనుమతి లేదని అధికారులు వెల్లడించారు.

undravajavaram subramanya swamy temple
షష్ఠి ఉత్సవాలకు ఉండ్రాజవరంలో ఏర్పాట్లు పూర్తి

పురాతన చరిత్ర కలిగి ఉన్న పశ్చిమ గోదావరి ఉండ్రాజవరం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో.. సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

స్థల పురాణం:

పదకొండో శతాబ్దం నుంచి ఈ ఆలయం ఉన్నట్లు చెబుతారు. రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న రోజుల్లో.. ఉరగ రాజు అనే సామంతరాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. స్వయంభూ అయిన స్వామివారికి ఉరగరాజు పూజలు చేశారనీ... రాజు పేరు మీదే గ్రామాన్ని ఉరగరాజపురమని పిలిచేవారనీ.. కాలక్రమేణా ఉండ్రాజవరంగా మారిందని చెబుతునారు.

ఉత్సవాలకు కరోనా ఆటంకం

ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఏటా సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలు ఘనంగా జరిగేవి. కరోనా వైరస్ కారణంగా ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. కొవిడ్ నిబంధనల వలన ఎటువంటి దుకాణాలు, ఊరేగింపులు జరపకూడదని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని పంచాయతీ అధికారులు ప్రకటించారు.

ఇదీ చదవండి:రబీ సాగేదెలా?.. అన్నదాతల్లో ఆందోళన...

ABOUT THE AUTHOR

...view details