హత్య కేసులో దోషులను శిక్షించాలంటూ దళితుల ధర్నా - దళితులు అందోళన
పశ్చిమ గోదావరి జిల్లా మండపాకలో దళితులు అందోళన చేపట్టారు. మూడు రోజుల క్రితం దళిత యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని... దోషులను గుర్తించి వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.
'హత్య కేసులో దోషులను శిక్షించాలంటూ దళితుల ధర్నా'
పశ్చిమగోదావరి జిల్లా మండపాక గ్రామంలో దళితులు ఆందోళన చేపట్టారు. దళిత యువకుడు శీలం రఘుబాబు హత్యకేసులో నిందితులను అరెస్టు చేయాలని కోరుతూ ప్రధాన రహదారిపై బైటాయించారు. నిందితులను అరెస్టు చేసి వారిపై షెడ్యూల్డ్ కులాల, తెగల అత్యాచార నిరోధకచట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పది లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలన్నారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోకపోతే.. పోరాటం తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు.