ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 14, 2020, 3:01 AM IST

ETV Bharat / state

ముగ్గుల్లో దాగి ఉన్న రహస్యమేంటి?

సంక్రాంతి వచ్చిందంటే.. ఆ సందడే వేరు. భోగిమంటలు,  హరిదాసులు, గంగిరెద్దులు, గాలిపటలు, ముగ్గులు గుర్తొస్తాయి. అయితే ఈ ముగ్గుల వెనక ఓ రహస్యం దాగుంది.

sankranthi muggulu
sankranthi muggulu

ధనుర్మాసం మెుదలయ్యాక ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు పెడతారు. బియ్యపు పిండిలో సున్నం కలిపి.. ఈ ముగ్గులు వేస్తారు. జీవులను పోషించే గొప్ప సంప్రదాయమే ఇది. చీమలు లాంటి చిన్న జీవులు.. బియ్యపు పిండి తిని.. సున్నం ఘాటుకు అక్కడే ఆగిపోతాయి. ఇంట్లోకి ప్రవేశించవు. మహిళలకు ముగ్గులు వేయడం ఓ పెద్ద వ్యాయామం కూడా. ముగ్గులు వేయడానికంటే ముందు.. ఇంటి ముందు కళ్లాపి చల్లుతారు. ఇందులోనూ శాస్త్రీయత దాగి ఉంది. కొత్త పంటలు కోసే సమయం కూడా ఇదే. దీంతో అప్పటి వరకూ పొలాలకే పరిమితమైన తేళ్లు, పాములు లాంటివి... ఊళ్ల మీదకు వస్తాయి. ఆవుపేడను నీటిలో కలిపి కళ్లాపి చల్లడం వలన ఆ వాసనకు క్రిమికీటకాలు... ఇంటి పరిసరాల్లోకి రావని పెద్దల మాట. అందులో భాగంగానే ఆవుపేడతో గొబ్బిళ్లు పెడతారు.

ABOUT THE AUTHOR

...view details