పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మీనవల్లూరు గ్రామానికి చెందిన కోణాల వెంకట భాస్కరరావు.. స్థానికంగా ఉన్న గ్రామ సచివాలయంలో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. ఉద్యోగరీత్యా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని పలుమార్లు తన భార్య వద్ద వాపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 25న భాస్కరరావు అతని సోదరుడు నాగ సూర్యనారాయణ మూర్తి నివాసానికి వెళ్లాడు. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన సోదరుడు.. భాస్కరరావును ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భాస్కరరావు.. ఆదివారం మృతి చెందాడు. ఊహించని ఈ ఘటనతో భాస్కరరావు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
పురుగుల మందు తాగి సచివాలయ ఉద్యోగి బలవన్మరణం
పని ఒత్తిడి తాళలేక సచివాలయ ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా మీనవల్లూరులో జరిగింది.
పురుగుల మందు తాగి సచివాలయ ఉద్యోగి బలవన్మరణం