పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం కూరేళ్లగూడెం వద్ద జాతీయ రహదారిపై సోమవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. 42 మంది ప్రయాణికులతో విజయవాడ నుంచి తణుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి..డివైడర్ మీదకు దూసుకువచ్చింది. అనంతరం అక్కడున్న విద్యుత్ స్తంభం, చెట్టును ఢీకొంటూ..ప్రైవేట్ ట్రావెల్ బస్సుపైకి దూసుకెళ్లింది. వెంటనే ప్రైవేట్ బస్సు డ్రైవర్ అప్రమత్తమై ఎడమవైపుకు తిప్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆంజనేయులు ,ప్రైవేట్ రాయల్ బస్సు క్లీనర్ సత్తిబాబు , నిడమర్రు మండలం బొమ్మనపల్లికి చెందిన మేడపాటి భరత్ రత్నకుమారి రాజు వదిన, బండి భవాని (సినీ దర్శకుడు బండి భాస్కర్ భార్య)తో పాటు మరో ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..తప్పిన పెను ప్రమాదం.. - west godavari district
విజయవాడనుండి తణుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూరేళ్లగూడెం జాతీయ రహదారిపై అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 14 మంది గాయపడ్డారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది.
rtc bus accident happend at koorellagudem national highway in west godavari district. fourteen people were injured in the accident.