ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదంలో ఒకరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు - పశ్చిమగోదావరి జిల్లా నేర వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

road accident in somavarappadu, westgodavari district one man killed and another man seveorely
సోమవరప్పాడులో జరిగిన రోడ్డు ప్రమాదం

By

Published : May 9, 2020, 8:16 PM IST

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన త్రిమూర్తులు, కొవ్వలి గ్రామానికి చెందిన చిన్నారావు వ్యవసాయ పనుల నిమిత్తం కొత్తపల్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. చిన్నారావును అతని స్వగ్రామంలో దించడానికి ద్విచక్రవాహనంపై తీసుకువస్తుండగా సోమవరప్పాడు వద్ద.. ప్రమాదం జరిగింది.

ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వీరి వాహనం ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన వీరిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా... చిన్నారావు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మెరుగైన వైద్యం కోసం త్రిమూర్తులును గుంటూరుకు తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details