పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లులో అజిత్రోమైసిన్ పేరుతో విక్రయిస్తున్న వివిధ రకాల మాత్రలను అధికారులు పరీక్షించారు. వాటిలో ప్రమాణాలకు తగ్గట్లు నాణ్యత లేదని వెల్లడైంది. అప్రమత్తమైన అధికారులు... కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఔషద దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో 3 లక్షల రూపాయలు విలువైన మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. మందుబిళ్లల ప్యాకింగ్‌పై ఉన్న వివరాల ఆధారంగా ఉత్తరాఖండ్‌లోని పరిశ్రమల్లో విచారించేందుకు ఔషద నియంత్రణ శాఖ అధికారులు ప్రత్యేక బృందాన్ని పంపుతున్నట్లు తెలిపారు.
మెడికల్ షాపుల్లో తనిఖీలు... రూ.3 లక్షల విలువైన మాత్రలు స్వాధీనం
అజిత్రోమైసిన్ పేరుతో విక్రయిస్తున్న మందుబిళ్లలను ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పరీక్షించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు ఔషధ దుకాణాల్లో సోదాలు చేశారు. మాత్రల ప్యాకింగ్‌పై ఉన్న వివరాల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.
ఔషధ దుకాణాల్లో తనిఖీలు... మూడు లక్షల రూపాయలు విలువైన మాత్రలు స్వాధీనం