పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గోదావరి వరద కాస్త తగ్గుముఖం పట్టింది. కొత్తూరు కాజ్వేపై ప్రస్తుతం ఐదు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. పైలెట్ ఛానల్ ద్వారా రహదారిపైకి వరద రావటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు స్పిల్ ఛానెల్ నుంచి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. కాగా పోలవరం ఎగువన ఉన్న గిరిజన గ్రామాలు మాత్రం ఇంకా వరద ముంపులోనే ఉన్నాయని అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించనున్నారు.
పోలవరంలో గోదావరి వరద తగ్గుముఖం
పోలవరంలో వరద ఉద్ధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. అధికారులు స్పిల్ ఛానెల్ నుంచి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.
తగ్గిన గోదావరి వరద ఉధృతి