ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేషన్ బియ్యం అక్రమ రవాణా గుట్టురట్టు...

పేదోడి పొట్ట నిండుతుందని ప్రభుత్వం పెట్టిన పధకాలలో రేషన్ బియ్యం ఒక్కటి..మరి దీన్ని అందరూ సద్వివినియోగం చేసుకుంటున్నారా అంటే...? ఓ ..ఎందుకు చేసుకోలేదు.. బ్రహ్మండంగా చేస్తున్నారు. ఏలా...? ఇంకెలా... రేషన్ బియ్యం కిలో 2 రూపాయలకి కొని, 16 నుండి 20 రూపాయల వరకూ చిన్న చిన్న కొనుగోలుదారులకు అమ్ముకుంటున్నారు.దాన్ని వాళ్లు కిలో 50 చొప్పున వేరే రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విజిలెన్స్ అధికారులుకు విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో సుమారు 26 టన్నులు బియ్యం వాహనాలు దొరకడం ఈ విషయానికి అద్దం పడుతుంది.

By

Published : Jul 9, 2019, 2:27 PM IST

రేషన్ బియ్యం అక్రమ రవాణా

రేషన్ బియ్యం అక్రమ రవాణా

రేషన్ బియ్యం అక్రమ రవాణా రోజు రోజుకు పెరిగిపోతుంది.. పశ్చిమగోదావరి, విశాఖలో కలిపి 30 టన్నుల బియ్యం ఉన్న వాహనాల్ని విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారంటేనే అర్ధమవుతుంది. పశ్చిమ గోదావరి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని తనిఖీ చేయగా సుమారు 3.50 లక్షల బియ్యం ఉన్నాయి. కాగా విశాఖలోనూ ఇదేమాదిరి ఇంట్లో దొరికాయి. గ్రామాల్లో సేకరించి భారీగా పోగు చేసి, మిల్లులకు తరలించి పొర తొలగించి అధిక ధరలు అమ్మకాలు చేస్తారని పట్టుబడిన వారు పేర్కొన్నారు.. ఈ వాహనాల్ని సీజ్ చేసి బాధ్యులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details