ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం - తణుకులో వర్షాలు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

rains at tanuku
తుణుకులో వర్షాలు

By

Published : Aug 27, 2020, 1:40 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మబ్బులు కమ్మి కుంభవృష్టిగా వర్షం కురిసింది. భారీగా కురిసిన వర్షంతో పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. పలుచోట్ల నివాసిత గృహాల ముందు నీరు చేరింది.

గ్రామాల్లోనూ కొన్ని ప్రధాన రహదారులు, వీధులలో రహదారులు సైతం నీట మునిగాయి. రాకపోకలకు ఇబ్బంది కలిగించాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు జనం ఇళ్లకే పరిమితమయ్యారు. పట్టణంతో పాటు గ్రామాల్లో రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

ఇదీ చదవండి: పిల్లల్నీ పీడిస్తున్న కరోనా వైరస్‌

ABOUT THE AUTHOR

...view details