ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తణుకులో భారీ వర్షం... ప్రజల ఉపశమనం

పశ్చిమగోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండల ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరయిన ప్రజలు.. ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.

By

Published : Jun 6, 2019, 6:23 PM IST

Updated : Jun 6, 2019, 7:52 PM IST

rain at tanuku

పశ్చిమగోదావరి జిల్లా తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొద్ది రోజులుగా ఎండల ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరయిన ప్రజలు ఈ జల్లులతో ఉపశమనం పొందారు.

ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామంలో ప్రధాన రహదారిపక్కనున్న భారీవృక్షాలు ఈదురుగాలులతో కూడిన వర్షానికి విరిగి రహదారిపై పడిపోయాయి. దీంతో తణుకు నుంచి తూర్పువిప్పర్రు గ్రామానికి వెళ్లే రహదారి మూసుకుపోవటంతో రాకపోకలు స్థంభించాయి. పరిసర ప్రాంతాలలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రాకపోకలు స్థంభించటంతో ప్రయాణికులు అయిదు కిలోమీటర్లు పైగా చుట్టు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

తణుకులో భారీ వర్షం... ప్రజల ఉపశమనం
Last Updated : Jun 6, 2019, 7:52 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details