పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరు, దేవరపల్లి మండలం యాదవోలు, చిన్నాయగూడెంలో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి 30 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు సీఐ బి.శ్రీనివాసరావు తెలిపారు.
జిల్లాలో నాటుసారా స్థావరాలపై దాడులు - కొవ్వూరు మండలం
కొవ్వూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో నాటుసారా, అక్రమ మద్యం రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించారు.
జిల్లాలో నాటుసారా స్థావరాలపై దాడులు
జంగారెడ్డిగూడెం స్టేషన్ పరిధిలో... జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో దాడులు నిర్వహించి నలుగురిని అరెస్ట్ చేసి 2600 లీటర్ల బెల్లపు ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. తెలంగాణా మద్యం 45 సీసాలు, 5 లీటర్ల సారా, మూడు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అజయ్ కుమార్ సింగ్ తెలిపారు.