పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ విషయంలో అన్ని విధాల తగిన న్యాయం చేస్తామని ఆ శాఖ ప్రత్యేక అధికారి కే ఆనంద్ కుమార్ స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పోలవరం నిర్వాసితుల కాలనీలు రామయ్య పేట పైడిపాక లో ఆయన పర్యటించారు. నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు కట్టించిన గృహాలు ఏ విధంగా ఉన్నాయి... అందరికీ అందాయా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందని వారు... అర్హత పత్రాలతో సంప్రదించాలని కోరారు. అనంతరం చల్ల వారి గూడెం, ధర్మ గూడెం, జీలుగుమిల్లి, బుట్టాయిగూడెంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు.
పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ అధికారి పర్యటన - rehabilation
ప.గో జిల్లా జంగారెడ్డి గూడెం మండలంలోని పోలవరం నిర్వాసిత గ్రామాల్లో అర్ అండ్ ఆర్ ప్రత్యేక అధికారి పర్యటించారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో ఆర్ అండ్ ఆర్ విభాగంలో నిర్మాణంలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించారు.
పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ఆర్ అండ్ ఆర్ ప్రత్యేక అధికారి పర్యటన