పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇసుక సమస్యను నిరసిస్తూ భాజపా ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఇసుక కొరతపై భవన కార్మికులు తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రధాన రహదారుల వెంట ప్లకార్డులు చేతబూని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు మాట్లాడుతూ... ప్రతి ఒక్క కార్మికుడికి నెలకు పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ భిక్షాటన ద్వారానైనా ప్రభుత్వం తక్షణమే కళ్లు తెరుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇసుక సమస్యను నిరసిస్తూ..తాడేపల్లిగూడెంలో భాజపా భిక్షాటన - పశ్చిమగోదావరి జిల్లా
ఇసుక సమస్యను నిరసిస్తూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భాజపా ఆధ్వర్యంలో భిక్షాటన చేపట్టారు.
ఇసుక సమస్యపై నిరసన వ్యక్తం చేస్తూ..భిక్షాటన