తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కొత్తపాలెం గ్రామానికి చెందిన మహిళలు ధర్నా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా గ్రామంలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. చెరువులో ఉన్న బురద నీటిని రెండు రోజులకు ఒకసారి సరఫరా చేస్తోన్నారని ఆ నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ట్యాంకర్ల ద్వారా తక్షణమే తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ధర్నా - dharna
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కొత్తపాలెం గ్రామానికి చెందిన మహిళలు ధర్నా నిర్వహించారు. తాగు నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ధర్నా