గుంటూరు జిల్లా వలివేరుకు చెందిన ఓ ఖైదీ రాజమాహేంద్రవరం సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కొద్ది రోజులుగా అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. స్నానపు గదిలోకి వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ భయటికి రాకపోయేసరికి అక్కడున్న వైద్య సిబ్బందికి అనుమానం వచ్చింది. వెళ్లి చూడగా అతను ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సెంట్రల్ జైలులో ఖైదీ ఆత్మహత్య - rajamahendravaram central jail
సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం స్నానపు గదిలోనే ఉరివేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు.
స్నానపు గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఖైదీ