పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, పోలవరం ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ పరిధిలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. బుట్టాయగూడెం మండలంలో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి 600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేశారు.
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు - natusara stavaralu latest news
జంగారెడ్డిగూడెం, పోలవరం ఎక్సైజ్ స్టేషన్ సర్కిల్ పరిధిలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుడి నుంచి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు
పోలవరం మండలం ఎల్ఎన్డీ పేటలో 800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసి, 60 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితుడి నుంచి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో జంగారెడ్డిగూడెం, పోలవరం సీఐలు అజయ్ కుమార్ సింగ్, సత్యనారాయణ, పోలవరం ఎస్సై శ్రీను, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి..