Police Over Action At Cm Meeting : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన సీఎం జగన్ సభలో పోలీసుల హంగామాతో మహిళలు, ఉద్యోగులు పడరాని పాట్లు పడ్డారు. ముఖ్యమంత్రి సభలో నిరసన తెలుపుతారన్న ఉద్దేశంతో భద్రతా అధికారులు.. నల్ల చున్నీలు, మాస్క్‌లు, వస్త్రాలు ధరించిన వారిని సభా ప్రాంగణంలోకి అనుమతి నిరాకరించారు. సమస్యలపై సీఎం సార్‌కు విజ్ఞప్తి చేయాలని వేడుకున్నా ససేమిరా అంటూ పక్కకు లాగేశారు.
సీఎం సభలో పోలీసుల ఓవరాక్షన్.. ఆంక్షలతో ఇబ్బంది పడ్డ మహిళలు
Police Over Action At Cm Jagan Meeting: నరసాపురంలో సీఎం సభకు వచ్చిన మహిళలు పోలీసుల ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నల్ల చున్నీలు, మాస్క్‌లు ధరించిన మహిళలు, ఉద్యోగుల్ని సైతం లోపలికి వెళ్లనీయక, బలవంతంగా అడ్డుకున్నారు. ప్రవేశం లేదంటూ పక్కకు లాగిపడేశారు. చున్నీలు తీసి బారికేడ్లపై వేసిన తర్వాతే.. లోపలికి పంపించడంతో.. పోలీసుల వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
police over action at cm meeting
సీఎం సభకు హాజరుకావాలంటే తప్పనిసరిగా నల్ల చున్నీలు, ఓణీలు తీసిరావాలని పోలీసులు ఖరాఖండిగా చెప్పడంతో మహిళలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సీఎం కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చామని,.. దయచేసి అనుమతి ఇవ్వాలని వేడుకున్నారు. పోలీసులు కుదరదని తేల్చి చెప్పడంతో.. తప్పని పరిస్థితుల్లో చున్నీలు బారికేడ్లపై వేసి లోపలి వెళ్లారు. భద్రతా సిబ్బంది తీరుపై మహిళా ఉద్యోగులు సైతం మండిపడ్డారు.
ఇవీ చదవండి: