పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెంలో పశువుల రవాణాను గ్రామస్థులు పట్టుకున్నారు. బుట్టాయిగూడెం మండలం గణపవరం కాలువ వంతెన వద్ద తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతం నుంచి హైదరాబాద్కు రెండు లారీల్లో తరలిస్తున్న 80 పశువులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై నాగరాజు లారీలను సీజ్ చేసి పశువులను గోశాలకు తరలించారు. పశువుల విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని ఎస్సై తెలిపారు.
"పశువుల రవాణాను అడ్డుకున్న ప్రజలు" - hyderabad
పశ్చిమగోదావరి జిల్లాలో పశువుల రవాణాను గ్రామస్థులు అడ్డుకున్నారు. తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. చివరికి పశువులు గోశాలకు చేరడంతో హర్షం వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలో అక్రమంగా పశువుల రవాణా