ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా తయారీ దారులపై పీడీ యాక్ట్​ నమోదు చేస్తాం - police Attacks at west godavari district

నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించిన పోలీసులు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్​డీ పేటలో పెద్ద ఎత్తున బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అక్రమ మద్యం, నాటుసారా తయారీకి పాల్పడిన వారిపై పీడీ యాక్ట్​ కింద కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.

Attacks on Natsara manufacturing plants
బెల్లం ఊట ధ్వంసం చేసిన పోలీసులు

By

Published : Jul 24, 2020, 7:12 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్​డీ పేటలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 400 లీటర్ల బెల్లపు ఊటను సీఐ నవీన్ మూర్తి, ఎస్సై శ్రీను ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. సారా తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన్నట్లు తెలిపారు. అక్రమ మద్యం, నాటుసారా తయారీ దారులపై పీడీ యాక్ట్ చట్టం నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details