ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రికెట్​ బుకీలకు.. ఓ కానిస్టేబుల్ ఆశ్రయం - క్రికెట్ బెట్టింగ్

సాంకేతిక పద్ధతులను ఉపయోగిస్తూ క్రికెట్ బెట్టింగ్​లను నిర్వహిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాకు ఓ కానిస్టేబుల్ అండగా ఉన్నట్టు గుర్తించారు.

police_arrested_criket_bookies

By

Published : Aug 6, 2019, 11:35 AM IST

క్రికెట్​ బుకీలకు..ఓ కానిస్టేబుల్ ఆశ్రయం

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల సమీపంలోని లక్ష్మీపురం వద్ద ఒక ఇంటిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో.. సీఐ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ద్వారకాతిరుమల పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ-20 క్రికెట్ పోటీల నేపథ్యంలో అక్కడ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని గుర్తించారు. ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన తాండ్ర వెంకట ముఖలింగం, కరణం హనుమాన్ ప్రసాద్, నిడమర్రు మండలం చిననిండ్రకొలనుకుచెందిన గాదిరాజు విజయ్ కుమార్ రాజు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర ఆధునికమైన కాల్ లైన్ బాక్స్ ఒక లాప్​టాప్​, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించారు. బెట్టింగ్ నిర్వాహకులకు ఓ కానిస్టేబుల్ ఆశ్రయించినట్లు పోలీస్ విచారణలో తేలింది. కానిస్టేబుల్​పై కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details