''వరదలు వస్తే.. పోలవరం భద్రత ఎలా?'' - ppa
పోలవరం ప్రాజెక్టు పురోగతి, పాక్షికంగా నిర్మించిన కాఫర్ డ్యాం రక్షణ చర్యలను ప్రాజెక్టు అథారిటీ సిబ్బంది పర్యవేక్షించారు.
పోలవరం
పోలవరం ప్రాజెక్ట్ పనులను ప్రాజెక్ట్ అథారిటీ కమిటీ(పీపీఏ) పరిశీలించింది. స్పిల్వే, స్పిల్ ఛానల్ గేట్లు అమరిక పనులను అథారిటీ ఛైర్మన్ ఆర్కే జైన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు నిశితంగా పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి, పాక్షికంగా నిర్మించిన కాఫర్ డ్యాం రక్షణ చర్యలను పర్యవేక్షించారు. గోదావరి వరదల సమయంలో ప్రాజెక్టు భద్రత పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారని అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.