పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ వెనుక భాగ్యలక్ష్మి పేటకు చెందిన మట్టల చంద్రకుమార్ అలియాస్ సిద్ధు అనే యువకుడు అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకోవటం అనుమానాలకు దారి తీస్తోంది.
అతడు భవనం ఎక్కడం, కింద పడి మృతి చెందడం సీసీ టీవీ ఫుటేజిలో క్షుణ్ణంగా రికార్డు అయ్యింది. పోలీసులు మృతుడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్ రాగా.. మృతదేహాన్ని పంచనామా కోసం తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలోని మొబైల్ ఫోన్, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.