నట్టేట మునిగిన లంక గ్రామాలు...ఇక్కట్లలో ప్రజలు గోదావరి వరదలు.. తూర్పు గోదావరి జిల్లాలోని లంకగ్రామలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. దేవీపట్నం మండలం పరిధిలోని 32 గ్రామాలు కొద్ది రోజులుగా జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం, మామిడికుదురు, కొత్తపేట మండలాలు ముంపునకు గురయ్యాయి. వీటి పరిధిలోని పలు ప్రాంతాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. రహదారులపై పెద్ద మొత్తంలో నీరు చేరుతోంది. నడుము లోతు నీళ్లల్లోనే ప్రజలు దినచర్య కొనసాగిస్తున్నారు.
రైతుల కన్నీరు
గోదావరి ఉగ్రరూపం రైతులకు శాపంగా మారింది. సుమారు 1500 ఎకరాల్లోని కూరగాయల పంటలు నీట మునిగాయి. పంట చేతికందే సమయంలో వరదతో తీవ్రంగా నష్టపోయామని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లంక గ్రామాల్లో పశువుల పరిస్థితి దయనీయంగా మారింది. గడ్డి, దాణా లేక ఆకలితో అలమటిస్తున్నాయి. మరోవైపు.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు కొంతవరకూ సదుపాయాలు ఏర్పటు చేశారు. పశువులపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
ఇదీ చదవండి
కశ్మీర్ అంశంపై నిపుణుల్లో భిన్న స్వరాలు