KOLLERU LAKE: కొల్లేరు సరస్సు ఐకానిక్‌గా 'గూడకొంగ' - కొల్లేరు సరస్సు తాజా వార్తలు
15:44 October 06
కొల్లేరు సరస్సు ఐకానిక్‌గా గూడకొంగను ఎంపిక చేసిన అటవీశాఖ
కొల్లేరు సరస్సు ఐకానిక్‌గా గూడకొంగను.. అటవీశాఖ ఎంపిక చేసింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఐకానిక్ వీక్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ప్రతీప్ కుమార్ గూడకొంగ లోగో, పోస్టర్‌ను ఆవిష్కరించారు. కొల్లేరు వంటి చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు.
రామ్ సర్ డిక్లరేషన్‌లో భాగంగా ప్రస్తుతం అభయారణ్యంగా, చిత్తడి నేలల ప్రాంతంగా కొల్లేరు సరస్సు ఎంపికైందని.. అత్యంత అరుదైన ఈ అభయారణ్యం, చిత్తడి నేలల పరిరక్షణ కోసం వెట్లాండ్ మిత్రాస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పీసీసీఏఎఫ్ ప్రతీప్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మ్యాప్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రస్తుతం కొల్లేరు సరస్సులోని సగం ప్రాంతం అభయారణ్యంగానూ మరో సగం చిత్తడి నేలల ప్రాంతంగానూ ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రాంత పరిరక్షణతో పాటు చిత్తడి నేలల ఆవశ్యకతను తెలియజేస్తూ సైన్ బోర్డు లను ఏర్పాటు చేస్తామన్నారు. స్థానికంగా సేవా దృక్పధం ఉన్నవారిని గుర్తించి వెట్లాండ్ మిత్రాస్‌ను నియమించినట్లు పీసీసీఎఫ్ తెలిపారు. ప్రస్తుతం కొల్లేరులో ఉన్న ఈ కొంగజాతి పక్షులు ప్రపంచ వ్యాప్తంగా నలభై శాతానికిపైగా ఇక్కడే ఉన్నాయని వివరించారు. దీంతో వెట్ ల్యాండ్ అంబాసిడర్‌గా గూడకొంగను ఎంపిక చేసినట్లు పీసీసీఏఎఫ్ ప్రతీప్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: