పశ్చిమగోదావరి జిల్లాలో వరి కోతలు కోస్తున్న రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల నడుమ అతికష్టం మీద ధాన్యాన్ని ఇంటికి చేర్చినా.. అమ్ముకోవడం వారికి తలకు మించిన భారమవుతోంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా.. అనేక నిబంధనలతో సమస్యలు తప్పడం లేదు.
17శాతం తేమ ఉంటేనే మద్దతు ధరకు కొంటామని అధికారులు చెప్పడం రైతులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. పంట నూర్పిడి చేసి ధాన్యాన్ని వారం రోజులపాటు ఆరబెడితేనే 17 తేమ శాతం వస్తుంది. గతంలో 17శాతానికి ఎక్కువగా ఉంటే ధరలో కోత విధించే వారు. కానీ.. ప్రస్తుతం మాత్రం ఆ అవకాశం కూడా ఇవ్వట్లేదని, ధాన్యాన్ని కొనేది లేదని అధికారులు తేల్చి చెబుతున్నారని రైతులు వాపోతున్నారు.