నివర్ తుఫాన్ ప్రభావంతో గడిచిన 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమగోదావరి జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. తణుకు, ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో వర్షం కారణంగా స్వర్ణ రకం వరి పొలాలు నేలకొరిగాయి. పలుచోట్ల పంట పాక్షికంగా పాడుకాగా... మరికొన్ని చోట్ల పూర్తిగా పడిపోయాయి. కోసిన పొలాల్లో వరి నీటి పాలైంది. చేతికి అందిన పంట దక్కకుండాపోయిందని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాను బీభత్సం..మునిగిన పంటలు - పశ్చిమగోదావరి జిల్లాలో వర్షాలు వార్తలు
నివర్ తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో తుపాను బీభత్సానికి వరిపంటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో తుపాను బీభత్సం
తణుకు పరిసర ప్రాంతాల్లో సుమారు 2,500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. నివర్ ప్రభావం తగ్గిన తర్వాత పంటనష్టాన్ని పూర్తిస్థాయిలో లెక్కిస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ కాలంలో ఇప్పటికే నాలుగు దఫాలుగా వర్షాల కారణంతో పంటలకు నష్టం వాటిల్లింది. తిరిగి తాజాగా నివర్ తుపాను ప్రభావంతో మరింత నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.
ఇదీ చూడండి.ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు.. అల్లకల్లోలంగా సముద్ర తీరం