ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కేసీఆర్​తో స్నేహపూర్వక బంధం అవసరం: వైకాపా - kcr

తెలంగాణ ముఖ్యమంత్రితో స్నేహపూర్వక సంబంధం ఉండాలి. పవన్ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విభేధాలు పెట్టేలా ఉన్నాయి- రఘరామకృష్ణం రాజు

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రఘరామకృష్ణం రాజు

By

Published : Mar 24, 2019, 12:48 AM IST

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న రఘరామకృష్ణం రాజు
పశ్చిమగోదావరి జిల్లా భీమిలి సభలో పవన్ చేసిన వ్యాఖ్యలను నరసాపురం వైకాపా ఎంపీ అభ్యర్థి రఘరామ కృష్ణం రాజు తప్పుబట్టారు. కలిసి మెలిసి ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య రాజకీయ కుంపటి పెట్టొద్దని కోరారు. 'తెలంగాణ ముఖ్యమంత్రితో మన రాష్ట్రానికిస్నేహం అవసరం. పక్క రాష్ట్రాలతో మనకి స్నేహ పూర్వక వాతవరణం ఉండాలి. నటుడిగా ,వ్యక్తిగా పవన్ కల్యాణ్ అంటే నాకు ఇష్టం. అందుకే చంద్రబాబు వలలో పడొద్దని కోరుతున్నా" అని భీమవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు.

పవన్ ఓడిపోవడం ఖాయం: గ్రంథి శ్రీనివాస్

పవన్భీమవరంలో ఓడిపోబోతున్నారని ఆ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. నామినేషన్ వెనక్కు తీసుకుని వెళ్తే పవన్​కి మర్యాదగా ఉంటుందని అన్నారు. జనసేనాని చెప్పే విలువలు, మాటలు అన్ని అబద్ధాలని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details