ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Onion Farmers: ఉల్లి రైతుల ఆశలపై నీళ్లు.. దళారుల చేతిలో మోసపోతున్న అన్నదాతలు - ధర దక్కక ఉల్లి రైతు ఆవేదన

అధిక శ్రమకోర్చి పంట పండిస్తున్న రైతు..ఆ పంటకు సరైన ధరను పొందలేకపోతున్నాడు. పంటకు మార్కెట్లో మంచి ధర ఉన్నా..అన్నదాత చేతికి వచ్చేసరికి..సగానికి పడిపోతోంది. ప్రజలు కొనుగోలు చేస్తున్న ధరకు..రైతుకు మార్కెట్లో దక్కుతున్న ధరకు పొంతన ఉండటం లేదు. పశ్చిమగోదావ రిజిల్లా తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్లో..తమ పంటకు గిట్టుబాటు ధర దక్కటం లేదని..ఉల్లి రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఉల్లి రైతుల ఆశలపై నీళ్లు
ఉల్లి రైతుల ఆశలపై నీళ్లు

By

Published : Nov 7, 2021, 5:03 PM IST

ఉల్లి రైతుల ఆశలపై నీళ్లు

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్‌కు..రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పంట వస్తుంది. ఈ మార్కెట్ నుంచి పలు ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రస్తుతం మార్కెట్​లో కిలో ఉల్లి ధర రూ.40 నుంచి రూ.50 వరకు ఉంది. ఉల్లి మార్కెట్​లో మాత్రం క్వింటాలు రూ. 1800 మించటం లేదు. నాణ్యమైన ఉల్లికి మాత్రం రూ.2 వేలు చెల్లిస్తున్నారు. వ్యాపారులు, దళారులు ఏకమవటం వల్ల...రైతుకు కనీస ధర దక్కడం లేదు.

బహిరంగ వేలం పాట ద్వారా తాడేపల్లిగూడెం మార్కెట్‌కు వచ్చిన ఉల్లి పంటకు ధర నిర్ణయిస్తారు. ఈ వేలంలో అధిక ధర చెల్లించిన వ్యాపారికి సదరు రైతు తను తెచ్చిన ఉల్లిని విక్రయించాల్సి ఉంటుంది. ముందుగానే మాట్లాడుకున్న ధర వరకు మాత్రమే వేలం పాటలు నిర్వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వేలం ధర తక్కువైనా కూడా పట్టించుకునేవారు లేరని అంటున్నారు. ఉల్లి పంట పండించడానికి ఎకరాకు దాదాపు రూ.70 వేలు ఖర్చవుతుందని..పంటను మార్కెట్‌కు తరలించేందుకు లారీ బాడుగ, కూలీలు, టోల్‌ ఖర్చులు, మార్కెట్‌ సెస్‌ పేరుతో రైతు కోతపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతుకు కనీస ధర దక్కేలా..మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: amaravati padayatra : పోటెత్తుతున్న అమరావతి ఉద్యమం.. పోలీసు హెచ్చరికలతో అలజడి!

ABOUT THE AUTHOR

...view details