ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సందడిగా ఒంగోలు గిత్తల బల ప్రదర్శన - అన్నంబోట్లవారిపాలెం వార్తలు

ప్రకాశంజిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో ఒంగోలు గిత్తల బలప్రదర్శన పోటీలు జరిగాయి. పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్​ఛార్జి రావి రామనాధం బాబు పోటీలను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Ongolu Gittala  competitions
ఒంగోలు గిత్తల బలప్రదర్శన పోటీలు

By

Published : Jan 14, 2021, 7:55 PM IST

ఒంగోలు గిత్తల బలప్రదర్శన పోటీలు

సంక్రాంతి సందర్భంగా ప్రకాశంజిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లవారిపాలెంలో ఒంగోలు గిత్తల బలప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. గొరంట్ల రత్తయ్య చౌదరి ప్రాంగణంలో పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్​ఛార్జి రావి రామనాధం బాబు పోటీలను ప్రారంభించారు. సంక్రాంతి రైతు సంబరాలు పేరుతో ఏర్పాటుచేసిన బండలాగుడు పోటీలకు తెలుగు రాష్ట్రాలనుంచి గిత్తలు బరిలో నిలిచాయి.

ఒంగోలు జాతి గిత్త.. మన రైతన్నల సత్తా అని రావి రామనాధం అన్నారు. పశుపోషకులను ప్రోత్సహించేందుకు పోటీలు ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. పోటీలను తిలకించేందుకు అధికసంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయి ఒంగోలు గిత్తల పోటీలు భోగిరోజు ప్రారంభం కాగా... నేడు జాతీయస్థాయి బలప్రదర్శన చేపట్టారు. మరోపక్క పొట్టేలు పందాలు జరుగుతుండటంతో... అన్నంబోట్లవారి పాలెంలో సంక్రాంతి శోభ నెలకొంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details