వ్యాయామ కళాశాలకు శాశ్వత అనుమతిపై పరిశీలన
శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్యా కళాశాల శాశ్వత గుర్తింపునకు సంబంధించి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అధికారులు పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలో పర్యటించారు.
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం గోపన్నపాలెంలోని శ్రీ సీతారామ ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల శాశ్వత గుర్తింపునకు సంబంధించి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అధికారులు పరిశీలించారు. కళాశాలలోని తాగునీటి, వసతి భవనాలు నిర్మాణం, క్రీడాప్రాంగణం, మినీ స్టేడియం తదితర ప్రాంతాలను విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ సురేష్ వర్మ, తాడేపల్లిగూడెం బ్రాంచ్ ప్రత్యేక అధికారి శ్రీ రమేష్ పరిశీలించారు. దస్త్రాలను పరిశీలించి శాశ్వత గుర్తింపునకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని అధికారులు సూచించారు.