స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లా తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో పలు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. తణుకు మండలంలో రెండు, నిడదవోలు పరిధిలోని ఉండ్రాజవరంలో రెండు నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. తక్కువ డిపాజిట్ కట్టడం, అభ్యర్థి సంతకంలో తేడాల వంటి కారణాలతోనే నామపత్రాలను పరిగణలోకి తీసుకోలేదని అధికారులు తెలిపారు.
చిన్న కారణాలతో తిరస్కరణకు గురైన నామినేషన్లు
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో అనేక నామపత్రాలు తిరస్కరణకు గురవుతున్నాయి. వీటిలో చాలావరకు చిన్న చిన్న కారణాలతోనే తిరస్కరణకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
చిన్న చిన్న కారణాలతో తిరస్కరణకు గురవుతున్న నామినేషన్లు