Tadepalligudem NIT: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖకు చెందిన రెండో ఏడాది విద్యార్థి జయకిరణ్ పై సీనియర్ విద్యార్థులు దాడి చేశారు. బుధవారం రాత్రి రూమ్‌కు పిలిపించుకుని తెల్లవారే వరకు విచక్షణారహితంగా సీనియర్లు కొట్టారని.. కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి విద్యార్థులను అరెస్టు చేశారు. ర్యాగింగ్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
తాడేపల్లిగూడెం నిట్‌లో ర్యాగింగ్.. 9 మంది విద్యార్థులు అరెస్ట్ - తాడేపల్లిగూడెం నిట్‌లో ర్యాగింగ్ కేసులో విద్యార్థులు అరెస్టు
Students Arrested at NIT: తాడేపల్లిగూడెం నిట్ కళాశాలలోని ర్యాగింగ్ ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. సీనియర్లను అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Ragging at NIT: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్ కళాశాలలో శుక్రవారం ర్యాగింగ్ కలకలం రేపింది. విశాఖకు చెందిన సెకండియర్ విద్యార్థి జయకిరణ్‌పై సీనియర్ విద్యార్థులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. బుధవారం రాత్రి రూమ్‌కు పిలుపించుకుని తెల్లవారే వరకు విచక్షణారహితంగా సీనియర్లు కొట్టారని.. తల్లిదండ్రులతో కలిసి కిరణ్ తాడేపల్లిగూడెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:తాడేపల్లిగూడెం నిట్‌లో ర్యాగింగ్ కలకలం.. విచారిస్తున్న పోలీసులు