సీఎం జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలపై పోరాడుతుండటం వల్లే అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్ష సాధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఏడాది పాలన వైఫల్యాలను ఎండగట్టే అచ్చెన్నాయుడు లాంటి నాయకులపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆయన విమర్శించారు.
'రాజకీయంగా ఎదుర్కోలేక.. కక్ష సాధింపు' - ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వార్తలు
వైకాపా ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే.. తెదేపా నేతలపై కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
nimmala ramanaidu