ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముగిసిన సాఫ్ట్​బాల్ పోటీలు... విజేతలకు ట్రోఫీ ప్రదానం - జాతీయ సాఫ్ట్‌ బాల్‌ ఛాంపియన్‌

క్రీడల్లో రాణించి దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న జాతీయ సాఫ్ట్​బాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందించారు.

ముగిసిన సాఫ్ట్​బాల్ పోటీలు... విజేతలకు ట్రోఫీ ప్రదానం

By

Published : Oct 5, 2019, 10:38 PM IST

ముగిసిన సాఫ్ట్​బాల్ పోటీలు... విజేతలకు ట్రోఫీ ప్రదానం
క్రీడల్లో రాణించి దేశానికి అంతర్జాతీయస్థాయిలో మంచి పేరు తీసుకురావాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న జాతీయ సాఫ్ట్​బాల్ పోటీల ముగింపు వేడుకకు మంత్రి హాజరయ్యారు. పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన ఛత్తీస్​గఢ్​ జట్టుకు మంత్రి ట్రోఫీ అందజేశారు. మహిళల విభాగంలో మహారాష్ట్ర జట్టు విజేతగా నిలిచింది. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమం అనంతరం మాట్లాడిన ఆయన తల్లాడ-దేవరాపల్లి జాతీయ రహదారి నిర్మాణానికి రూ.100 కోట్లతో అంచనాలు పంపామన్నారు. ప్రస్తుతం ఈ రహదారి మరమ్మతులకు రూ.1.40 కోట్లు మంజూరు చేశామన్నారు.

ఇదీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details