ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమ్ముడిని హత్య చేసిన అన్న..ఐదుగురు నిందితుల అరెస్ట్ - పశ్చిమగోదావరి జిల్లా

ఆస్తి తగాదాల్లో తమ్ముడిని హత్య చేసిన అన్నను, హత్యకు సహకరిచిన మరో నలుగురిని ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులు అరెస్టు

By

Published : Oct 6, 2019, 11:37 PM IST

నిందితులు అరెస్టు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మెుండుకోడు గ్రామానికి చెందిన కడకల్లు హరిబాబును సొంత అన్న ఆస్తి తగాదాలతో గత నెల 26న హత్య చేసి పరారయ్యాడు. హరిబాబు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏలూరు రూరల్ సీఐ మాట్లాడుతూ కడవకల్లు హరిబాబు.. తన అన్న కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఆస్తి తగాదాలుండేవని తెలిపారు. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని తమ్ముడైన హరిబాబు ఒక్కడే అనుభవిస్తున్నాడని వారిద్దరి మధ్య గొడవలు జరిగాయన్నారు. ఆస్తిని తమ సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో కడవకల్లు వీరస్వామి, ఆంజనేయులు, వెంకటేశ్వరరావు, జనార్ధన్, దివ్య ఆంజనేయులు సెప్టెంబర్​ 26న ద్విచక్ర వాహనంపై వెళ్తున్న హరిబాబును మునుగోడు శివారు వద్ద అడ్డగించి ఇనుప రాడ్లతో బలంగా కొట్టి పరారయ్యారు. కొన ఊపిరితో ఉన్న హరిబాబును స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందాడని సీఐ వివరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి, నిందితులను, అరెస్టు చేసి వారి వద్ద నుంచి హత్య కు ఉపయోగించిన ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details