ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా ఎమ్మెల్యేలతో రఘురామకృష్ణరాజుకు ప్రాణహాని ఉంది' - పోలీసులకు రఘురామకృష్ణరాజు పీఎస్ ఫిర్యాదు వార్తలు

ఎంపీ రఘురామకృష్ణరాజుకు ప్రాణహాని ఉందని ఆయన పీఎస్ కృష్ణవర్మ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు, కార్యకర్తల వల్ల ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ తన సొంత నియోజకవర్గానికి వస్తే దాడి చేసే అవకాశాలున్నాయని.. రక్షణ కల్పించాలని కోరారు.

personal secretary of raghuramakrishnaraju complaints to police
personal secretary of raghuramakrishnaraju complaints to police

By

Published : Jun 21, 2020, 3:23 PM IST

Updated : Jun 21, 2020, 4:11 PM IST

ఎంపీ రఘురామకృష్ణరాజు.. తన సొంత నియోజకవర్గానికి వస్తే దాడి చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన వ్యక్తిగత కార్యదర్శి​ కృష్ణవర్మ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజుకు వైకాపా ఎమ్మెల్యేలు, కార్యకర్తల వల్ల ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉండి, ఆచంట, ఆకివీడు, తాడేపల్లిగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. రఘురామకృష్ణరాజు పశ్చిమగోదావరి జిల్లాలో తిరగాలంటే.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు.

Last Updated : Jun 21, 2020, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details