పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ సందర్శించారు. స్వామి దర్శనానంతరం ఆలయ ఈవో రావిపాటి ప్రభాకర రావు స్వామివారి మెమెంటోను అందజేశారు. చిన్న వెంకన్న ఆలయాన్ని రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. రాజమండ్రి సమీపంలోని కడియం గ్రామంలో 48 గంటల్లో ఇన్ఫిల్ టెక్నాలజీతో మోడల్ హౌస్ నిర్మించామని తెలిపారు.
ద్వారకా తిరుమల ఆలయాన్ని సందర్శించిన ఎంపీ మార్గాని భరత్ - ద్వారకా తిరుమల ఆలయం వార్తలు
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయాన్ని.... ఎంపీ మార్గాని భరత్ సందర్శించారు. ద్వారకా తిరుమలను రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ద్వారకా తిరుమల ఆలయాన్ని సందర్శించిన ఎంపీ మార్గాని భరత్