ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరిలో నిలిచిన పంటు...గుప్పిట్లో ప్రాణాలు

గోదావరి నదిని పంటుపై దాటే ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాల్సిన పంటు నిర్వాహకులు అలసత్వం వహిస్తున్నారు. పంటు నిర్వహణలో నిబంధనలు పాటించకుండా ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గురువారం రాత్రి చోటుచేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి రేవు నుంచి 100 మందితో నరసాపురం బయలు దేరిన పంటు వశిష్ట గోదావరి నది మధ్యలో నిలిచిపోయింది.

గోదావరిలో నిలిచిన పంటు...గుప్పిట్లో ప్రాణాలు

By

Published : May 10, 2019, 6:20 AM IST

సుమారు గంటన్నర పాటు పంటు నదిలోనే ఉండిపోవడం వలన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అలల ప్రవాహానికి కొంత మేర నదిలో కొట్టుకుపోయిన పంటు వలకట్టు అడ్డుపడటంతో నది మధ్యలోనే నిలిచింది. డీజల్ అయిపోవడం వలన పంటు ఆగిపోయిందని నిర్వహకులు తెలిపారు. సమాచారాన్ని తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పంటును ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేపట్టారు. మరొక పంటు సాయంతో ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

గోదావరిలో నిలిచిన పంటు

ఇక్కడ తరచూ ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నా పంటు నిర్వహకులు తగిన నివారణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు డిజిల్, లైఫ్ జాకెట్లు అందుబాటులో లేకపోవడాన్ని ప్రయాణికులు తప్పుబట్టారు. ఇప్పటికైనా పంటు నిర్వహణలో నిబంధనలు పాటించి ప్రయాణికులు సురక్షితంగా గోదావరి దాటే చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు. జరిగిన సంఘటనపై విచారణ చేపట్టి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇవీ చూడండి :అమెరికా కుర్రాడు... ప్రేయసి కోసం ఆంధ్రాకి వచ్చాడు!

ABOUT THE AUTHOR

...view details