జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని .. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి స్వగ్రామం కొండలరావుపాలెం నుంచి ద్వారక తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు. ఐదేళ్ల పాటు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరారు. కార్యకర్తలు నాయకులతో తెల్లవారు జామున 3 గంటలకు కొండల రావుపాలెం నుంచి కాలినడకన రాట్నాలు కుంట చేరుకొని అక్కడ పూజలు చేశారు. అనంతరం పెదవేగి, ముందూరు, మేదినరావుపాలెం, రామారావుగూడెం, చల్లచింతలపూడి, పెరుగుగూడెం మీదుగా ద్వారకాతిరుమల వెళ్లారు. ఏలూరు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో బందోబస్తు పర్యవేక్షించారు.
ద్వారక తిరుమలకు దెందులూరు ఎమ్మెల్యే పాదయాత్ర
దెందులూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొఠారు అబ్బయ్య చౌదరి స్వగ్రామం కొండలరావుపాలెం నుంచి ద్వారక తిరుమలకు పాదయాత్రగా బయల్దేరారు.
ఎమ్మెల్యే