ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇన్​పుట్​ సబ్సిడీ ఇచ్చినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా: నిమ్మల - పాలకొల్లు తాజా వార్తలు

ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ పాలకొల్లులో రైతులతో కలిసి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఏ ఒక్క రైతుకైనా ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చినట్లు రుజువు చేస్తే శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్​ విసిరారు. రైతులకు ఇన్​పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

mla nimmala ranmanayudu
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు

By

Published : Jan 9, 2021, 12:45 PM IST

రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ పాలకొల్లులో రైతులతో కలిసి శాసనసభ్యుడు నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పాలకొల్లు వ్యవసాయ మార్కెట్​లో నిరసన దీక్ష చేపట్టారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రైతుకు కూడా ఇన్​పుట్ సబ్సిడీ ఇవ్వలేదని ఎమ్మెల్యే నిమ్మల ఆరోపించారు. ఒక్క రైతుకైనా ఇన్​ఫుడ్ సబ్సిడీ ఇచ్చినట్లు రుజువు చేస్తే ఇక్కడి నుంచే శాసనసభ స్థానానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో మంత్రులు వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే బాధాకరంగా ఉందని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details