పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిన్న సాయంత్రం అదృశ్యమైన బాలుడి ఆచూకీని పోలీసులు గుర్తించారు. తణుకు పట్టణంలో బాలుడు తిరుగుతుండగా పోలీసులు గుర్తించి... తల్లిదండ్రులకు అప్పగించారు. నిన్న పాఠశాల నుంచి వచ్చిన వెంటనే పుస్తకాలు ఇంట్లో ఉంచి అబ్దుల్ రహమాన్ అదృశ్యమయ్యాడు. సిగరెట్ కాలుస్తున్నాడని తెలిసి తండ్రి మందలించటంతో... బాలుడు ఇంటినుంచి వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు.
బాలుడి ఆచూకీ లభ్యం...తల్లిదండ్రుల హర్షం - పశ్చిమగోదావరి జిల్లా తణుకు
తణుకులో నిన్న సాయంత్రం అదృశ్యమైన బాలుడి ఆచూకీ దొరకటంతో...తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
బాలుడి ఆచూకీ లభ్యం...తల్లిదండ్రుల హర్షం