పశ్చిమగోదావరిజిల్లా తణుకులో మంత్రులు శంకరనారాయణ, శ్రీరంగనాథ రాజు పర్యటించారు. వివిధ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు. పేద, బడుగు వర్గాల కోసం ఆరోగ్య శ్రీ వంటి ఎన్నో మంచి పథకాలను అమలులోనికి తెచ్చిన మహావ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. అటువంటి మంచి ఆలోచనలు చంద్రబాబునాయుడు ఏనాడు చేయలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోయినపుడు కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతతో ప్రజలు తెదేపాను గెలిపించారని మంత్రి చెప్పారు. తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రంలో వివిధ వర్గాల కోసం పోరాటాలు చేసిన జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఆదరించి అధికారం కట్టబెట్టారని వెల్లడించారు. మరోమంత్రి శ్రీరంగనాధరాజు మాట్లాడుతూ రానున్న కాలంలో ఇరవై అయిదు లక్షల ఇళ్లు పేదలకు కట్టించే అవకాశం జగన్‌మోహన్‌రెడ్డి తనకి కల్పించినందుకు మంత్రి శ్రీరంగనాథరాజు ఆనందిస్తున్నానన్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చే ఇళ్లస్థలాలకు ఇకముందు దస్తావేజులు రూపంలో బ్యాంకులలో కుదువపెట్టుకుని రుణాలు పొందే అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈసందర్భంగా బీసీ కులాలకు ఉపకరణాలు పంపిణీ చేశారు.
తణుకులో మంత్రుల పర్యటన - west godavari
చంద్రబాబు పేద, బడుగువర్గాల సంక్షేమం పట్టదని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మంత్రి శ్రీరంగనాథరాజుతో కలిసి ఆయన పర్యటించారు.
మంత్రుల పర్యటన