వరదల నేపథ్యంలో ఉన్నతాధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో చర్చ జరిపి... గోదావరి వరదలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నుంచి అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
వరద ఉద్ధృతిపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాసం ఏర్పాటు చేయాలని మంత్రి పెద్ది రెడ్డి ఆధికారులను ఆదేశించారు. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్పరెన్స్ నిర్వహించారు.
వరదలపై అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కల్పనపై అధికారులతో సమాలోచనలు చేశారు. వరదల నుంచి ప్రజలను అప్రమత్తం చేయడంపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు. వరద ప్రాంతాల్లో తాగునీరు, నిత్యావసరాలు సరిగా అందేలా చూడాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.