ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం నిర్మాణం వేగవంతం చేస్తాం: మంత్రి అనిల్ - పోలవరం నిర్మాణంపై అనిల్ కామెంట్స్

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేస్తామని మంత్రి అనిల్ కుమార్ చెప్పారు. ఇవాళ ఆయన ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో జలవనరులశాఖ అధికారులతో సమీక్షించారు. నిర్వాసితుల పరిహారం వివరాలు తెలుసుకున్నారు.

పోలవరం నిర్మాణం వేగవంతం చేస్తాం : మంత్రి అనిల్
పోలవరం నిర్మాణం వేగవంతం చేస్తాం : మంత్రి అనిల్

By

Published : May 6, 2020, 1:24 PM IST

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. హిల్ వ్యూ, స్పిల్ వే, గేట్లు తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు.

అనంతరం క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. నిర్వాసితులకు అందాల్సిన పరిహారం వివరాలు తెలుసుకున్నారు. లాక్​డౌన్ వల్ల పనుల్లేక ఇబ్బందులు పడుతున్న నిర్మాణ రంగ కూలీలను వారి సొంత రాష్ట్రాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి:

75 శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో రిట్ పిటిషన్

ABOUT THE AUTHOR

...view details