పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు గ్రామీణ మండలం అర్బన్ కాలనీలను మంత్రి ఆళ్లనాని సందర్శించారు. కాలనీల్లోని ఇళ్లు, ఇంటి స్థలాలను పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న గృహాల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. కాలనీల్లో ఉన్న సమస్యలతో తాము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు మంత్రికి తెలియజేశారు. దీంతో ఇందిరమ్మ కాలనీలో రహదారులు, మురుగు నీటి కాలువలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు పరిసరాలతోపాటు.. ఇతర పట్టణాల్లో ఉన్న అర్బన్ కాలనీల్లో సదుపాయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
అర్బన్ కాలనీలను పరిశీలించిన మంత్రి ఆళ్లనాని - Minister Allanani examined in the urban colonies
మంత్రి ఆళ్లనాని ఏలూరు గ్రామీణ మండలం అర్బన్ కాలనీలను పరిశీలించారు. అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్బన్ కాలనీల్లో సదుపాయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
అర్బన్ కాలనీలను పరిశీలించిన మంత్రి ఆళ్లనాని