ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించటమే సీఎం జగన్ లక్ష్యం'

వైకాపా అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే వైద్యశాఖ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ రూ.16 వేల కోట్లు కేటాయించారని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించటమే సీఎం జగన్ లక్ష్యమని తెలిపారు.

'ప్రతి పేదవాడికి కార్పోరేట్ వైద్యం అందించటమే సీఎం జగన్ లక్ష్యం'
'ప్రతి పేదవాడికి కార్పోరేట్ వైద్యం అందించటమే సీఎం జగన్ లక్ష్యం'

By

Published : Nov 21, 2020, 3:29 PM IST

రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించటమే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో 100 పడకల ఏరియా ఆసుపత్రికి, మొగల్తూరులో పబ్లిక్ హెల్త్ సెంటర్​ అభివృద్ధికి ఆయన భూమి పూజ చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలోనే వైద్యశాఖ అభివృద్ధికి రూ.16 వేల కోట్లు కేటాయించారన్నారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే రూ.1200 కోట్లతో రెండు మెడికల్ కాలేజీల నిర్మాణం, ఆసుపత్రిల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

అందరికీ ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీని సడలించి వెయ్యి రూపాయల నుంచి 5 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేందుకు మార్పు తీసుకువచ్చామన్నారు. రోగుల కుటుంబానికి అండగా ఉండేందుకు ఆరోగ్య ఆసరా పథకం కింద నెలకు రూ.5 వేలు అందిస్తున్నామని తెలిపారు. వైద్యరంగంలో మార్పులు తీసుకువచ్చేందుకు రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీలను అభివృద్ధి చేయడంతో పాటు మరో 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సీఎం చర్యలు చేపట్టారన్నారు.

ABOUT THE AUTHOR

...view details